ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి అయిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలానే మరోవైపు ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా సినిమాని ప్రశాంత్ నీల్ తీస్తున్న విషయం తెల్సిందే. అయితే దీని తరువాత ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ ఓకె చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కొన్ని నెలల క్రితం వచ్చింది. కాగా అది మాత్రమే కాక ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ వినిపించిన ప్రశాంత్ నీల్, త్వరలో దాని స్క్రిప్ట్ పూర్తి కాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాల్లో ముందుగా ఎవరి సినిమా మొదలెట్టాలి అనే విషయమై ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒకింత డైలమాలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తుండగా, త్వరలో కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టనున్నారు ఎన్టీఆర్. కాగా ఈ సినిమాల తరువాతనే ఇద్దరూ ప్రశాంత్ నీల్ సినిమా చేయాలని భావిస్తున్నారని, మరి వీరిద్దరిలో ఎవరితో ప్రశాంత్ ముందుగా సినిమాని చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి దీనిపై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి