బాలీవుడ్ హాట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ దీపికా ప్రస్తుతం తను నటించిన 'గెహ్రాయా' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన ఓటీటీలో రిలీజ్ కానుంది.ఇక ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు శకున్ బత్రాతో పాటు అనన్య పాండే ఇంకా సిద్ధార్థ్‌ చతుర్వేదిలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది హాట్ బ్యూటీ దీపికా. ఇక ఇందులో భాగంగా ఆమె కొన్ని విషయాలను కూడా చెప్పుకొచ్చింది. అలియా భట్‌తో కలిసి ఫారెన్ లో తాను ఓ మ్యూజిక్‌ కాన్సెర్ట్ కు వెళ్లిన సమయంలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటనను గురించి దీపికా పంచుకుంది.ఇక 'బెర్లిన్'లో జరిగిన ఆ కోల్డ్ ప్లే మ్యూజిక్ కాన్సెర్ట్ కు అలియా భట్ తో పాటు కలిసి వెళ్లిందట దీపికా . ఇద్దరూ కలిసి రెస్ట్ రూమ్ కి వెళ్లగా..అక్కడ ఉమెన్ బాత్రూమ్ ముందు పెద్ద క్యూ అనేది ఉందట.

అంత టైం ఆపుకోలేక వెయిట్ చేయలేక ఇక పక్కనే ఉన్న మెన్ వాష్ రూమ్ కి వెళ్లారట. అవి ఎంతో డర్టీగా ఉన్నాయని.. కానీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది హాట్ బ్యూటీ దీపికా. అర్జెంట్ గా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడైనా ఉపయోగించాల్సిందే అని చెప్పింది ముద్దుగుమ్మ దీపికా.ఇక తను, అలియా భట్ కలిసినప్పుడు ఆ సంఘటనను సరదాగా గుర్తు చేసుకొని బాగా నవ్వుకుంటూ ఉంటామని చెప్పింది దీపికా. ఇక ఇదిలా ఉండగా 'గెహ్రాయా' సినిమాలో ఈ హాట్ బ్యూటీ దీపికా లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమాలో ఆమె యంగ్ హీరో సిద్ధార్థ్‌ చతుర్వేదితో ఇంటిమేట్ సీన్స్ లో హాట్ రొమాన్స్ తో బాగా నటించింది. దాంతో ఈ సినిమా ట్రైలర్ కూడా బాగా వైరల్ అయింది. అలాగే మరోపక్క దీపికా.. 'ప్రాజెక్ట్ K' ఇంకా 'పఠాన్' వంటి భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా కూడా సైన్ చేసింది ఈ హాట్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: