మార్చి 25 వ తేదీన అనగా ఈరోజు దేశమంతా కూడా ఆర్ ఆర్ ఆర్ (RRR) మేనియా నడుస్తుంది. అన్నిచోట్లా ఈ సినిమాను వీలైనంత త్వరగా చూడాలని ఇరు హీరోల అభిమానులు ఎంతగానో తహతహలాడుతున్నారు. అందుకే థియేటర్స్ దగ్గర ఎక్కడ చూసినా కాని ఇద్దరి హీరోల అభిమానుల హంగామానే ఎక్కువగా కనిపిస్తుంది.ఇక ముఖ్యంగా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ అయితే బ్యానర్లు కట్టి బాగా సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సందడి వాతావరణంలో ఇప్పుడు అనుకోని ఓ విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వి.కోట దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆర్ ఆర్ ఆర్ సినిమా అభిమానులు మృత్యువాత పడ్డారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా బెనిఫిట్‌ షోకి వెళ్తున్న ఈ యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆ ముగ్గురు యువకులు కూడా దుర్మరణం పాలయ్యారు. దీనికి ముందే వాళ్లు థియేటర్స్ దగ్గర బ్యానర్స్ కట్టారని సమాచారం తెలుస్తుంది. 


ఇక ఆ తర్వాత బెనిఫిట్ షోకు వెళ్తుంటే మార్గ మధ్యలో వారికి యాక్సిడెంట్ అయింది. దాంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా రిలీజ్ సందర్భంగా అర్ధరాత్రి బెనిఫిట్‌ షో టికెట్ల కోసం వి.కోటకు వారు వెళ్లారు.తమిళనాడు రాష్ట్రం బోర్డర్‌లోని ఓ ఊరు నుంచి ఈ కుర్రాళ్లు వచ్చారు. థియేటర్‌కు వస్తున్న సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుస్తుంది. మృతులు రామకుప్పం ఇంకా అలాగే వీ. కోటకు చెందిన యువకులుగా గుర్తించారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరిపారు. ఏదేమైనా సినిమా చూడాలని బయల్దేరిన ఈ కుర్రాళ్లు.. ఇలా దుర్మరణం పాలవడంతో వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా దారుణమైన సంఘటన అని చెప్పాలి.కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి.ఈరోజుల్లో బైక్స్ అవసరమే తప్ప అత్యవసరం కాదు.కాబట్టి వాహనాలు వున్నవారు చాలా జాగ్రత్తగా తక్కువ స్పీడ్ తో శ్రద్దగా నడుపుతూ వెళ్ళండి.నిదానమే ప్రధానం అని గ్రహించండి. ప్రాణాలు పోగొట్టుకొని మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR