వివాదాల దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా తీసినా, ఏదన్నా ఇంటర్వ్యూలో మాట్లాడినా, ఏదైనా టాక్ షోలో పాల్గొన్నా, గేమ్ షో లో ఉన్నా ఇలా ఎక్కడైనా రాంగోపాల్ వర్మ ఉంటే చాలు ఎంతో విభిన్నంగా ఉంటుంది అక్కడి వాతావరణం..


అని అనడంలో సందేహం లేదు. రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో తన డేంజరస్ సినిమా విభిన్నంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడట.. తెలుగు తమిళంలోనే కాకుండా మొత్తం ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ వర్మ ప్రకటించాడని తెలుస్తుంది.సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరు హీరోయిన్ల ను వెంటేసుకొని దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాడు ఆర్జీవి.ఆ మధ్య రాజమౌళి మరియు ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్‌ లు కలిసి ఎలా అయితే దేశ వ్యాప్తంగా ప్రమోషన్ కోసం చక్కర్లు కొట్టారో.. ఇప్పుడు అలాగే డేంజరస్ సినిమా కోసం నైనా గంగూలీ మరియు అప్సర రాణి లతో కలిసి రామ్ గోపాల్ వర్మ దేశ వ్యాప్తంగా హడావుడి చేస్తున్నాడట  .


ఎప్పటిలాగే తన సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటూ హడావుడి చేస్తున్న వర్మ అనూహ్యంగా ఇలా కుర్తా వేసుకున్న ఫోటోను షేర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచాడు.రామ్ గోపాల్ వర్మ అంటే చాలా విభిన్నమైన వ్యక్తి.. కానీ ఆయన డ్రెస్సింగ్ మరియు ఆయన లుక్ ఎప్పుడు కూడా చూడటానికి ఒకేలాగ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆయన చాలా డిఫరెంట్‌ గా మరియు అందంగా కనిపించి అందరినీ కూడా ఆశ్చర్య పరిచాడు. బాబోయ్ ఇలాంటి యాంగిల్ కూడా రామ్ గోపాల్ వర్మ లో ఉందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.మరి కొందరు మాత్రం కొత్తపెళ్లి కొడుకులా ఉన్నావు.. పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారట.మొత్తానికి వర్మ మాటలు మాత్రమే కాదు ఆయన ఫోటోలు కూడా ఎంతో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: