ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రంలో విలన్ గా సోనుసూద్ కూడా కనిపించాడు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఒకవైపు థియేటర్లలో ఆచార్య సినిమా సందడి చేస్తూ ఉండగానే మరొకవైపు ఆచార్య ఓటిటి ఎంట్రీ కి సంబంధించి ఒక వార్తతో చాలా వైరల్ గా మారుతోంది.. ఆచార్య సినిమా త్వరలోనే ఓ టీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం రైట్స్ ను భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఈ చిత్రం ఓటిటీ లో రాబోతున్నట్లు గా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాలే కాకుండా మెగా స్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో ని విడుదల కాబోతున్నట్లు గా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ చాలా శరవేగంగా జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. మరి ఆచార్య సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతోంది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి