టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా  తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం అఫీషియల్ ప్రకటన చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 అసలు విషయం లోకి వెళితే...  రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను  తెరకెక్కించబోయే సినిమా కోసం భారీ మొత్తంలో బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే సినిమా కోసం ఏకంగా వంద కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా రామ్ పోతినేని సినిమా కోసం ఇంత రేంజ్ లో బడ్జెట్ కేటాయించడానికి ప్రధాన కారణం...  రామ్ పోతినేని కి హిందీ లో ఉన్న క్రేజే  కారణం... ఇప్పటి వరకు రామ్ పోతినేని హిందీ లో నేరుగా ఒక్క సినిమాలో కూడా నటించడం పోయినప్పటికీ రామ్ పోతినేని నటించిన అనేక తెలుగు మూవీ లు  హిందీ లో డబ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకున్నాయి.

 అలా డబ్ అయిన సినిమాతోనే ఆ రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణ పొందిన రామ్ పోతినేని సినిమాకు 100 కోట్ల బడ్జెట్ పెద్ద విషయమేమీ కాదు అని,  ఒక వేళ సినిమాకు కనుక మంచి టాక్ వచ్చినట్లయితే అదిరిపోయే కలెక్షన్ లము వసూలు చేయవచ్చు అనే ఉద్దేశంతో నిర్మాతలు రామ్ పోతినేని,  బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా కోసం ఈ రేంజ్ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: