పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను అందించాడు.

 ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా,  దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. భీమ్లా నాయక్ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  దగ్గుబాటి రానా హీరోలుగా నటించడం,  అయ్యప్పనున్ కోషియన్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాకు భీమ్లా నాయక్ రీమేక్ గా తెరకెక్కడం తో భీమ్లా నాయక్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

 ఈ సినిమా విజయంలో ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర ను పోషించింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం తమన్ అందించిన సాంగ్స్ లో నుంచి ఒక సాంగ్ తాజాగా ఒక అదిరిపోయే రికార్డ్ ను సాధించింది.  భీమ్లా నాయక్ సినిమా నుండి చిత్ర బృందం మొదటగా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ అయితే స్టార్టింగ్ లోనే యూననిమస్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అలాగే ఈ సాంగ్ లో కనిపించిన కిన్నెర మొగులయ్య కి కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నారు. తాజాగా ఈ సాంగ్ యు ట్యూబ్ లో రికార్డ్ మైల్ స్టోన్ 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిగా రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: