బాలీవుడ్ లో ‘పుష్ప’ ఆస్థాయిలో ఘనవిజయం సాధిస్తుందని సుకుమార్ కూడ ఊహించలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈమూవీ కేవలం బాలీవుడ్ లోనే 100కోట్ల మార్క్ ను అందుకుని అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ఇప్పుడు ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగిపోవడంతో సుకుమార్ ఈమూవీ సెకండ్ పార్ట్ విషయంలో చాలజాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


సుమారు 400కోట్ల బడ్జెట్ ను ఈపార్ట్ 2కు కేటాయించడంతో పాటు ‘కేజీ ఎఫ్ 2’ ఘన విజయంతో ఎలర్ట్ అయిన సుకుమార్ ‘పుష్ప 2’ స్క్రిప్ట్ విషయంలో చాలమార్పులు చేసాడు. వాస్తవానికి ‘పుష్ప’ పార్ట్ వన్ ను నల్లమల అటవీప్రాంతంలో షూట్ చేయాలని భావించారు. అయితే అప్పటి కరోనా పరిస్థితులు అడ్డుతగలడంతో కొంతమేరకు దేవీపట్నం దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియాలో షూట్ చేసి ఒక కృత్రిమ ఫారెస్ట్ ను హైదరాబాద్ లోని ఒకప్రముఖ స్టూడియోలో క్రియేట్ చేసి దానికి గ్రాఫిక్స్ హంగులు అద్దారు అన్నవార్తలు ఉన్నాయి.


అయితే ఈసారి సుకుమార్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా మారింది అంటున్నారు. ఈమూవీ పై పెరిగిపోయిన భారీఅంచనాల రీత్యా ఈమూవీని బ్యాంకాక్ దగ్గరలోని దట్టమైన అటవీప్రాంతంలో ‘పుష్ప 2’ షూటింగ్ ను ప్రారంభించాలని సుకుమార్ నిర్ణయించుకోవడంతో బ్యాంకాక్ లోని అధికారులతో ఈవిషయమై ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లింగ్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సాసించే డాన్ గా మారడంతో ఈమూవీ షూటింగ్ ను అనేక దేశాలలో షూట్  చేసేవిధంగా ప్లాన్ చేసుకున్నారు.


ఈసినిమాకు అల్లు అర్జున్ 70కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు అన్నవార్తలు ఒకవైపు హడావిడి చేస్తుంటే ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ కు 40కోట్ల పారితోషికం ఇస్తున్నారు అని వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. జూలై నెలనుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీని వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల చేయాలి అన్న టార్గెట్ తో సుకుమార్ వ్యూహాలలో ఉన్నాడు..మరింత సమాచారం తెలుసుకోండి: