ఛలో సినిమా తో మొదటి సారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్,టాలీవుడ్ చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తోంది. ఒకే సారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. అలా ప్రస్తుతం రష్మి క క్రేజి హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్నది. రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. ఇక రష్మిక తన కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసినదే. తన కుటుంబం కర్ణాటకలో ఉంటే రష్మిక హైదరాబాదులో సపరేట్ గా ఉన్నది.


ఇక షూటింగ్ ఎక్కువగా ముంబైలో ఉండడం వల్ల ఈమె అక్కడే గడుపుతోంది. అప్పుడప్పుడు మాత్రమే రష్మిక తన ఇంటికి వెళుతూ ఉంటోంది. షూటింగ్లో గ్యాప్ దొరికితే వెంటనే రష్మిక తన ఇంట్లోకి వాలిపోతుంది. నా చిట్టి చెల్లెలు తో కూడా ఆడుకుంటూ ఉంటుందట. పేరెంట్స్ తో కలసి తన సమయాన్ని గడుపుతూ ఉంటుంది ఇక ఈ నలుగురు కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదని చెప్పవచ్చు. రష్మిక తన ఫ్యామిలీ ఫోటో లను రిలీజ్ చేసిన ప్రతిసారి చాలా ట్రెండీగా మారుతూనే ఉంటుంది.రష్మిక చెల్లెలు ఫోటోలు మాత్రం అందరినీ బాగా ఆకట్టు కుంటూ ఉంటాయి. ఇక తాజాగా రష్మిక తన పేరెంట్స్ గురించి తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది తల్లిదండ్రులకు పెళ్లి రోజును తెలిసి కూడా కాస్త ఆలస్యంగా విష్ చేయడంతో ఆమె అంత బిజీగా ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సారీ అని చెప్పేసింది. నాకు తెలుసు నేను ఇది చాలా లేటుగా చెబుతున్నానని హ్యాపీ యానివర్సరీ మమ్మీ , పప్ప, నన్ను పుట్టినందుకు ఈ ప్రపంచం లోకి తీసుకు వచ్చినందుకు నాకు నేనుగా నచ్చినట్లుగా బతుకుతున్న అందుకు థాంక్స్ అని తెలియజేసింది. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరే అని మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని రష్మిక ఒక పోస్టు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: