ఎందరో నటులు ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగు పెడతారు. అనూహ్యంగా అదృష్టం వరించి కాలం కలిసొచ్చి హిట్స్ అకౌంట్ లో పడి క్రేజ్ అలా ఒక్కసారిగా పెరిగితే దాన్ని సరిగా వడుకోలేక , ఎలా నిలబెట్టుకోవాలి అన్న అవగాహన సరిగా లేక కొన్ని పొరపాట్ల వలన తమ కెరియర్ ని నాశనం చేసుకుంటుంటారు. ఇదే తరహాలో స్టార్ హీరో అవ్వాల్సిన ఓ హీరో తన కెరియర్ ను చేతులారా నాశనం చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు... చాక్లెట్ బాయ్ హరీష్. ఈ హీరో ఒకప్పుడు టాలీవుడ్ లో తారా జువ్వలా సందడి చేసి అనూహ్యంగా కనుమరుగైపోయాడు. అయితే ఈ హీరో బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. 1980 లో బాలనటుడిగా ఏఎన్నార్ , ప్రేమాభిషేకం, ఎన్టీఆర్ వంటి హీరోల చిత్రాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత హరీష్ 1990లో ప్రేమ ఖైదీ చిత్రం తో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఎక్కడ లేని క్రేజ్ ను అందుకుని  అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక్కసారిగా ఓవర్నైట్ హీరోగా మారి అందలం ఎక్కారు.  అయితే తన మిస్టేక్స్ వలన ఈ చాక్లెట్ బాయ్ ఒక్కసారిగా  కిందకు పడ్డాడు. ఆ తరవాత అవే పొరపాట్లను కంటిన్యూ చేస్తూ కనుమరుగైపోయాడు. టాలీవుడ్ లో క్రేజ్ పెంచుకుని ఇక్కడ స్టార్ హీరోగా ఎదగాల్సిన టైంలో బాలీవుడ్ వైపు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచనతో టాలీవుడ్ పై ఫోకస్ పక్కన పెట్టాడు. దాంతో మెల్లమెల్లగా తెలుగులో హరీష్ కి క్రేజ్ తగ్గింది.

అంతే కాకుండా అతడు ఇతర భాషల్లో చేసిన కొన్ని  అశ్లీల చిత్రాలు తెలుగులో డబ్ అవడంతో ఉన్న మంచి పేరు కూడా పోయి ఆఫర్లు బాగా తగ్గాయి. సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని దర్శకులు చెప్పింది చేస్తూ మరింత ఢీలా పడిపోయాడు. ఆ చిత్రాలు హిట్ అయినా సోలో హీరో కాదని హరీష్ కి ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.  దాంతో అప్పట్లో హరీష్ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నా ఇతనికి మాత్రం పేరు వచ్చేది కాదు. సోలో హీరోగా ఎదగాల్సిన టైంలో మల్టీస్టారర్ సినిమాలు చేయడం కూడా పెద్ద పొరపాటు అని చెప్పాలి. ఇలా కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల వల్లే తన కెరియర్ అటకెక్కింది అని స్టార్ హీరో అవ్వాల్సిన హరీష్ ఇండస్ట్రీలోనే లేకుండా కనుమరుగైపోయారు అని అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: