దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నయనతారకు ఎలాంటి క్రేజ్ ఉందో మన అందరికీ  తెలిసింది.అయితే ఈమె లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార అందరికన్నా అత్యధిక పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఇకపోతే ఈమె కేవలం కమర్షియల్ చిత్రాల ద్వారా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక  ఇలా వరుస సినిమా అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో అగ్రతారగా దూసుకుపోతున్న నయనతారను లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుతో పిలుస్తారు.

ఇదిలావుంటే తాజగా నయనతార ఈనెల 9వ తేదీ తన ప్రియుడు విగ్నేష్ ను మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఇక వీరి వివాహం అనంతరం ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు. ఇకపోతే  ఈమె పెళ్లి జరుగుతున్న సమయంలో తిరిగి నయనతార సినిమాలలో నటించాలని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఒకవేళ నటించిన ఈమె కండిషన్లకు నిర్మాతలు ఒప్పుకుంటేనే సినిమాల్లో నటిస్తుందని వార్తలు వచ్చాయి.అంతేకాకుండా తాజాగా ఈమె హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాక  ఇండియా రాగానే ఈమె తన తదుపరి చిత్రం జవాన్ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం ముంబై వెళ్లారని సమాచారం.అయితే  అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.ఇకపోతే ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే.ఇక ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో నయనతార ముందు వరుసలో ఉంటారు.ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న జవాన్ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: