అందాల ముద్దు గుమ్మ నిత్యా మీనన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యా మీనన్, నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మూవీ లలో నటించి మెప్పించిన నిత్యా మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరుచుకుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లో నిత్యా మీనన్, పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిత్య మీనన్ మూవీ లతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే నిత్యా మీనన్ ప్రముఖ 'ఓ టి టి' ఆహా లో  తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రాం కు జడ్జిగా వ్యవహరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నిత్యా మీనన్ మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ సిరీస్‌ ప్రమోషన్ లతో ఫుల్ బిజీగా ఉంది.

ఈ మధ్యేనే మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌ లో భాగంగా నిత్యా మీనన్ ఇద్దరి సాయంతో కర్ర పట్టుకొని స్టేజి పైకి వచ్చింది. దీనితో నిత్య మీనన్ కు ఏమైంది అని చాలా మంది కంగారు పడ్డారు. స్టేజి మీద నిత్యా మీనన్ మాట్లాడుతూ... రెండు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి కింద పడ్డాను అని,  కాలికి గాయం అయ్యింది. అందుకే ఇలా నడవాల్సి వస్తుంది అని నిత్య మీనన్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: