మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక మిస్సింగ్ కేసును పోలీసులు లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది.  కానీ ఒక సివిల్ ఆఫీసర్ అయిన రామారావు ఎందుకు ఈ కేసు ను డీల్ చేశాడు. అనే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించగా ,  దివ్యాంశ కౌశిక్ , రాజేష విజయన్ ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని రేపు అనగా జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు సభ్యుల నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.  అలాగే ఈ సినిమా 2 గంటల 26 నిమిషాల మీడియం రేంజ్ టైమింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆఖరుగా ఖిలాడి మూవీ తో  ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుండో చూడాలి. చాలా సంవత్సరాల తర్వాత రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో వేణు తొట్టెంపూడి ఒక కీలక పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: