సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే మొదటి సినిమా తోనే అద్భుతమైన విజయం మరియు గొప్ప గుర్తింపు లభిస్తుంటాయి . అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం , అంతకంటే అద్భుతమైన గుర్తింపు దక్కించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో సదా ఒకరు.

ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని, అంతకు మించిన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత తమిళ సినిమా అపరిచితుడు  తో సదా అటు తమిళ్ ఇటు తెలుగు రెండు సినిమా ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం వీలుచిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తున్న సదా కొన్ని టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా తన సమయాన్ని గడుపుతోంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా సదా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సదా అదిరిపోయే డీసెంట్ లుక్ లో సారీ ని కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, క్లాస్ గా, డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: