టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి  గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు.ఈ వయసులో కూడా ఆయన  ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఇక  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.అయితే తాజగా  మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' పిక్చర్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ క్రమంలోనే నెక్స్ట్ ఫిల్మ్ 'గాడ్ ఫాదర్' పైన మెగా ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.

ఇకపోతే మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ 'లూసిఫర్'కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ డెఫినెట్ గా హిట్ కావాలని అంటున్నారు.కాగా  ఈ క్రమంలోనే చిత్ర అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా దర్శకుడు మోహన్ రాజా అప్ డేట్ ఇచ్చేశారు.ఇదిలావుంటే సోషల్ మీడియా వేదికగా 'గాడ్ ఫాదర్' పిక్చర్ లోని స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇకపోతే ఈ సాంగ్ కు కింగ్ ఆఫ్ డ్యాన్స్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తు్న్నారని, మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టెప్పులేస్తున్నారని తెలిపారు.ఇక  మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.

కాగా చిరంజీవి..'రాజా విక్రమార్క' చిత్రంతో ప్రభుదేవాను కొరియోగ్రాఫర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పోతే ఆ తర్వాత వీరు పలు పాటలు చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ 'గాడ్ ఫాదర్' కోసం కొలాబరేట్ అయ్యారు.అయితే ఈ సాంగ్ లో వెరీ డిఫరెంట్ గా ప్రభుదేవా స్టెప్స్ కంపోజ్ చేశారని తెలుస్తోంది. కాగా ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్లూ భాయ్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని అంటున్నారు.కాగా ఆచార్య సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే నయనతార ఇందులో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుండగా, సునీల్, సత్యదేవ్ , సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: