టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ లలో మంచి గుర్తింపు ఉంది. ఎమోషనల్ గా ప్రేక్షకులను అలరిస్తూ వెంకటేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇతర హీరోలకు భిన్నంగా సినిమాలు చేస్తూ ఇప్పటిదాకా మంచి సక్సెస్ ను అందుకున్న వెంకటేష్ ఇటీవలే ఎఫ్3 అనే ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను అలదించాడు. అందులో ఇద్దరు హీరోలైనా కూడా వెంకీ తనకంటూ ప్రత్యేకమైన ముద్రను చాటుకున్నాడు.

తన అభిమానులను ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో అలరించి ఇప్పుడు తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా కూడా నటిస్తూ మరొక సరికొత్త ట్రెండుకు నాంది పలుకుతున్న వెంకటేష్ ఇప్పటిదాకా తన తదుపరి చేయబోయే సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు మూడు చిత్రాలను ఓకే చేసుకునే రోజుల్లో వెంకటేష్ ఒక చిత్రం విడుదలయ్యి చాలా రోజులే అవుతున్న కూడా తన తదుపరి సినిమా ను ఎవరితో చేయబోతున్నాడు అన్న స్పష్టత తన అభిమానులకు ఇవ్వకపోవడం నిజంగా అందరిని నిరాశ పరుస్తుంది. 

వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు కాబట్టి సినిమాను తర్వాత అనౌన్స్ చేయవచ్చు అని ఆలోచిస్తున్నాడో ఏమో తెలియదు కానీ ఈ విధమైన నిర్ణయం ఏమాత్రం బాగోలేదని చెప్పవచ్చు. ఇతర సీనియర్ హీరోలు సైతం రెండు మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచితే తన ఒకే ఒక్క ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వారికి నచ్చడం లేదు. త్వరలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమా యొక్క ప్రకటన ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అయన ఒక పెద్ద హీరో సినిమా తోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. దాని వివరాలు త్వరలోనే తెలియనున్న్నా యి. 

మరింత సమాచారం తెలుసుకోండి: