నందమూరి బాలకృష్ణ మాస్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగులు చెబుతూ ఉంటే మాస్ ప్రేక్షకులు అందరికి కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పటి వరకు ఎన్నో ఫ్యాక్షనిజం సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు బాలకృష్ణ. అయితే వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీ గానే నిలిచింది అనే విషయం తెలిసిందే. కథా కథనంలో కొన్ని లోపాలు ఉండం కారణంగానే బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా యావరేజ్ గా నిలిచిందని అప్పట్లో సినీ విశ్లేషకులు కూడా చెప్పారు.


 ఇక ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిరంజీవి ఇంద్ర సినిమాను బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టింది.  ఇకపోతే బాలకృష్ణ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు వి.వి.వినాయక్. చెన్నకేశవరెడ్డి సినిమాలో ముందుగా బాలయ్య సరసన హీరోయిన్గా సౌందర్యాన్ని తీసుకోవాలని అనుకున్నాం. అయితే సౌందర్య మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశారు అంటూ వివి వినాయక్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఈ సినిమా ద్వారా ఒక స్టార్ హీరో ని నేను హ్యాండిల్ చేయగలను అని నమ్మకం వచ్చింది.


 కానీ బాలకృష్ణను ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో మాత్రం నేను చూపించ లేక పోయాను. ఇందులో యంగ్ ఓల్డ్ పాత్రలు ఉంటాయి.. ఇక ఓల్డ్ పాత్రకు జోడీగా సౌందర్యను నటించమంటే ఆమె నో చెప్పింది. ఓల్డ్ పాత్రలు చేస్తే ఇక మళ్లీ ఓల్డ్ పాత్రలే తన దగ్గరికి వస్తాయని సౌందర్య తనతో చెప్పింది అంటూ వి.వి.వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఇక మెయిన్ హీరోయిన్గా శ్రీయను తీసుకోవాలని ముందుగానే అనుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఓల్డ్ పాత్రకి హీరోయిన్ టబు ని తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఇక చెన్నకేశవరెడ్డి యావరేజ్  తర్వాత వీరి కాంబినేషన్లో నర్తనశాల అనే సినిమా  మొదలై షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: