నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి తన కంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు . కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో విషయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు .

ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక షేర్ కలెక్షన్ వసూలు చేసిన 6 సినిమాల గురించి తెలుసుకుందాం. కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తాజాగా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ కేవలం 3 రోజుల బాక్సాపీస్ రన్ ముగిసే సరికి 18.29 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్ మూవీ 16.45 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసేది.

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 మూవీ 11.59 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది ఈ మూవీ కి కె.వి.గుహన్ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇజం సినిమా 11.30 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఎం ఎల్ ఏ మూవీ 9.35 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే సినిమా 9 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: