ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమలో ప్రేమ జంటలు బ్రేక్ అప్ లు చాలా విరివిగా జరుగుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కొంతకాలం సంసారం జీవితాన్ని గడిపి విడిపోయిన జంటలు ఉన్నాయి. అదే విధంగా సంవత్సరాలుగా ప్రేమలో పడి డేటింగ్ లో ఉండి విడిపోయిన వారిని కూడా మనము చూశాము. తాజాగా మరో బాలీవుడ్ జంట బ్రేక్ అప్ చేసుకుందని వార్తలు  వస్తున్నాయి. మరి వారెవ్వరో.. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో చూద్దాం. బాలీవుడ్ లో హీరో మరియు హీరోయిన్ లుగా కొనసాగుతున్న టైగర్ ష్రాఫ్ మరియు దిశా పటాని ల గురించి తెలిసిందే. వీరిద్దరూ గత ఆరు సంవత్సరాల నుండి లవ్ లో ఉన్నారు.

అయితే తమకంటే తక్కువ వయసు ఉండి ప్రేమించుకున్న జంటలు సైతం టక్కున పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటే, వీరు మాత్రం ఇంకా ప్రేమలోనే మునిగి తేలుతున్నారు. అయితే త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు సైతం ఈ మధ్యన హల్ చల్ చేశాయి. కానీ ఇంతలోనే వీరిద్దరూ విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. కానీ ఈ మధ్యనే ఒక పార్టీ కార్యక్రమం లో వీరి మధ్య స్వల్పంగా గొడవ జరిగిందట. అప్పటి నుండి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందట. అందుకే ఇద్దరూ చర్చించుకుని ఇక విడిపోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దిశా పటాని పెళ్లి చేసుకుందాం అని తొందరపెడుతుంటే... టైగర్ ష్రాఫ్ మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నాడట.

ఇలా వీరి బ్రేక్ అప్ విషయం వైరల్ అయింది. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా... దీనిపై టైగర్ ష్రాఫ్ మాత్రం ఏమీ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ బ్రేక్ అప్ వార్తలకు బ్రేక్ పడి... త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: