ఇండియా వైడ్ గా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తానేంటో అనేక సార్లు నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. పొన్నియన్ సెల్వన్ మూవీ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను, ఒక పాటను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. పొన్నియన్ సెల్వన్ మూవీ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ విడుదల తేదీని తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది. చోళ చోళ అంటూ సాగే ఈ  సాంగ్ ని రేపు అనగా ఆగస్ట్ 19 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: