టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయిన ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆఖరు గా జాంబి రెడ్డి అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో తేజ సజ్జ హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే మరో సారి ప్రశాంత్ వర్మ , తేజ సజ్జ కాంబినేషన్ లో హను మాన్ అనే మూవీ తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.  తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియ జేశాడు. తాజాగా హను మాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ఇంస్టా గ్రామ్ ద్వారా త్వరలో నే హను మాన్ మూవీ టీజర్ అప్డేట్ కు సంబంధించి ఒక ప్రకటనతో వస్తాను అని చెప్పు కొచ్చాడు. ఈ మూవీ భారీ వి ఎఫ్ ఎక్స్ లతో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో అమృత అయ్యార్ కథానాయకిగా నటిస్తోంది.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ లో వినయ్ వరలక్ష్మి శరత్ కుమార్ ను కూడా భాగస్వాములు.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ ,  తేజ సబ్జా కాంబినేషన్ లోతెరకెక్కిన జాంబీ రెడ్డి మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హను మాన్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టు కున్నారు. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయన్జ్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: