ప్రస్తుతం థియేటర్లకు పోటీగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లలో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నా.. ఓటీటీ ఆదరణ మాత్రం తగ్గడం లేదు.
సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా..అటు థియేటర్లలో హిట్ చిత్రాలను మిస్ అయినవారు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాంలో సక్సెస్‏పుల్‏గా దూసుకుపోతున్న ఓటీటీలలో ఆహా ఒకటి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ లు.. ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుగులోకి డబ్ చేసి మరీ సినీ ప్రియులకు ముందుకు తీసుకువస్తుంది ఆహా. తాజాగా మరో తమిళ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసుకురాబోతుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'ఇరువక్కు ఆయిరమ్ కంగళ్' అనే ను తెలుగులోకి రేయికి వేయి కళ్లు' తీసుకొస్తున్నారు. ఈ ఆహాలో సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు తమిళ్ హీరో అరుళ్‌నిధి స్టాలిన్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రేయికి వేయి కళ్లు అనే తో ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షుకులు, విమర్శకులు అందరూ కూడా లోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ ను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో గుర్తుకు వస్తుంటుంది. డైరెక్టర్ ము. మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు ఉన్నాయి.

'రేయికి వేయి కళ్లు' కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్‌ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అంచనా వేయలేరు. అదే ఈ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: