సరికొత్త కథాంశాలతో ఆకట్టుకునే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'హనుమాన్'. తేజ సజ్జ హీరోగా తొలి ఇండియన్ సూపర్ హీరో సినిమాగా రూపొందిస్తున్నారు.
అమృత అయ్యర్‌ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 'హనుమాన్' సినిమా టీజర్ ను దసరాకు విడుదల చేయాలి అనుకున్నా.. వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన సోషల్ మీడియా  వేదికగా వెల్లడించాడు.

ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆదిపురుష్' టీజర్ సైతం అదే రోజు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన టీజర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపాడు. "'హనుమాన్' టీజర్ ను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ, రాముడు వస్తున్నాడని తెలిసింది. అందుకే, 'హనుమాన్' ఆగి, రాముడికి స్వాగతం చెప్తున్నాడు. త్వరలోనే టీజర్ విడుదల తేదిని ప్రకటిస్తాం. అప్పటి వరకు ప్రభాస్ హీరోగా వస్తున్న 'ఆదిపురుష్'ను చూద్దాం" అని తెలిపారు.
ప్రశాంత్ వర్మ తెరెక్కిస్తున్న 'హనుమాన్' ప్రాజెక్ట్ మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ టీజర్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో తేజా సజ్జా గిరిజన యువకుడిగా కనిపించాడు. రామాయణంలోని హనుమంతుడి పాత్రను.. సూపర్ హీరోను బేస్ చేసుకుని 'హనుమాన్' మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తన ప్రతి సినిమాను డిఫరెంట్‌గా ట్రై చేసే ప్రశాంత్ వర్మ.. ఈ మూవీని కూడా సరికొత్తగా డిజైన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ మైఖేల్ పాత్రను ప్రముఖ హీరో వినయ్ రాయ్ పోషిస్తున్నాడు. తాజాగా వినయ్ రాయ్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. బాడాస్ ఈవిల్ మ్యాన్ గా వినయ్ రాయ్ ఇందులో కనిపించాడు. ఈ పోస్టర్‌తో మూవీపై అంచనాలను పెంచాడు ప్రశాంత్ వర్మ. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: