‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ తీసిన బుచ్చిబాబు గత రెండు సంవత్సరాలుగా ఏసినిమా చేయకుండా ఖాళీగా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ యంగ్ డైరెక్టర్ కు ఎన్నో సినిమాలకు సంబంధించి ఆఫర్లు వచ్చినప్పటికీ అతడు జూనియర్ ఎన్టీఆర్ తోనే సినిమా తీస్తాను అంటూ ఎదురు చూస్తూ ఉండటంతో బుచ్చిబాబుకు ఈకష్టాలు వచ్చాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.



వాస్తవానికి ‘ఉప్పెన’ విడుదల అయిన తరువాత వెనువెంటనే బుచ్చిబాబు మరో కొత్త హీరో లేదంటే మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వదులుకుని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడమే తన ధ్యేయంగా ఒక కథ పట్టుకుని తారక్ చుట్టూ విపరీతంగా తిరిగాడు అని అంటారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు వ్రాసుకున్న ఈకథలో జూనియర్ 60 ఏళ్ళ వృద్ధుడుగా కనిపిస్తూ వీల్ చైర్ లో ఉండే పాత్ర ఇది.



ఫ్లాష్ బ్యాక్ లో ఈకథ అంతా నడుస్తుంది. ఈకథ పారా ఒలింపిక్స్ నేపధ్యంలో నడుస్తుంది. వాస్తవానికి ఈకథ తారక్ కు బాగా నచ్చినప్పటికీ ఈకథ విషయంలో కొన్ని సందేహాలు అతడికి ఉండటంతో తారక్ బుచ్చిబాబు చేత ఒకటికి రెండుసార్లు వ్రాయించాడు అని అంటారు. కథ తారక్ కు నచ్చింది అని సంకేతాలు ఇచ్చినప్పటికీ ఎప్పటి నుండి జూనియర్ తన డేట్స్ ను ఈసినిమాకు ఇస్తాడో క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్.



దీనితో ఈ కథను ఒక మీడియం రేంజ్ హీరోతో చేయడానికి బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు కూడ ముందుకు కదలడంలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. తన గురువు సుకుమార్ సహాయం తీసుకుని ఒక మెగా కుటుంబ హీరోతో ఈ మూవీని చేయడానికి లేటెస్ట్ గా బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కనీసం ఈప్రయత్నాలు అయినా విజయవంతం అవుతాయో లేదో చూడాలి..







మరింత సమాచారం తెలుసుకోండి: