సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారికి బుల్లితెరపైకి తీసుకువచ్చి లైఫ్ ఇస్తూ ఉంటుంది ఈటీవీ యాజమాన్యం. ఇక తర్వాత స్టార్ మా లో బిగ్ బాస్ తదితర షోలు కూడా ఎంతోమందికి లైఫ్ ఇచ్చాయని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన వర్ష ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యి.. ఆ తర్వాత జబర్దస్త్ లో మరింత క్రేజ్ ను సంపాదించింది. ఇక జబర్దస్త్ లో ఇమ్మానుయేల్, వర్షం కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి.

వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ అప్పుడప్పుడు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా గతం నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వర్ష కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా వర్ష హాస్పిటల్లో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ ఫోటోలు వర్ష హాస్పిటల్ బెడ్ పైన ఉండగా ఆమె చేతికి ఏదో సెలైన్ పెట్టి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా నిన్నటి రోజున ఆమె చికెన్ తినాలని ప్లేట్లో పెట్టుకున్న తినలేకపోయానని తెలియజేసినట్లు సమాచారం. ఇక తనకి అనుమానం వచ్చి టాబ్లెట్లు వేసుకున్నానని కామెంట్ చేసింది. అయినా కూడా హాస్పిటల్ బెడ్ రూమ్ పైన చికిత్స చేయించుకోవడం తప్పడం లేదన్నట్లుగా కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఇక తన ఫోటోల ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్నట్లుగా కూడా ఈ ఫోటోలను చూస్తే మనకి తెలుస్తోంది. సీజనల్ ఎఫెక్ట్ వలన ఈమెకు డెంగ్యూ జ్వరం వచ్చినట్లుగా సమాచారం. దీంతో పలువురు అభిమానుల సైతం ఈమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: