మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం లో కంటే ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా, జనరంజకంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది. గడిచిన సీజన్స్ లో ఎవరు హౌస్ నుండి బయటకి వెళ్ళబోతున్నారు..ఇక ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారు అనేది అన్ని స్పష్టం గా తెలిసేవి..ఎందుకంటే సోషల్ మీడియా లో పలు వెబ్సైట్స్ నిర్వహించే పొలింగ్స్ ద్వారా చాలా తేలికగా పసిగట్టేవారు ఆడియన్స్..కానీ ఈ సీజన్ లో అలాంటి వాటికి తావు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు బిగ్ బాస్ టీం.ఇకపోతే బాగా ఆడుతున్నారు అనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది..

ఇక అలాంటి షాకింగ్ ఎలిమినేషన్స్ లో ఒకటే సూర్య ఎలిమినేషన్..ఎంటర్టైన్మెంట్ పంచడం లోను..టాస్కులు ఆడడం లోను సూర్య ఇంట్లో ఉన్న ఎంతో మంది ఇంటి సభ్యులకంటే బెటర్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు..అతి మంచితనం అతనిని ఎలిమినేట్ అవ్వడానికి దారి తీసింది అంటున్నారు విశ్లేషకులు.. అంతేకాదు ముఖ్యంగా లేడీస్ పట్ల సూర్య అంతలా శ్రద్ద చూపడం.. ఇక వాళ్ళతో పులిహోర కలపడం వంటివి ఆడియన్స్ కి నచ్చి ఉండకపోవచ్చు.అంతే కాకుండా  ఇక ఎలాంటి హీట్ వాతావరణం ఎదురైనా సూర్య లో కోపం అనేది మనం చూడడం చాలా తక్కువ..బిగ్ బాస్ లో అలాంటివి పనికిరావు..

ఎందు కో  ఇక సూర్య పూర్తిగా ఫేస్ కి ఉన్న మాస్కు తియ్యలేదని స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది.. అందుకే ఇక ఆడియన్స్ అతనికి కనెక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు..సూర్య బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్నందుకు అతనికి భారీ స్థాయి లోనే పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇకపోతే సూర్య బిగ్ బాస్ హౌస్ లో 8 వారాలు కొనసాగాడు..అతను బిగ్ బాస్ హౌస్ కి వచ్చినందుకు గాను, సగటున అతనికి ఒక రోజుకు 27 వేల రూపాయిలు ఇచ్చేవారట..ఇక అలా అతను ఉన్న 56 రోజులకు కలిపి బిగ్ బాస్ 15 లక్షల రూపాయిలు పారితోషికం గా ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఇకపోతే ప్రేక్షకులకు పెద్దగా ముఖ పరిచయం లేని సూర్య కి అంత రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తే..సింగర్ రేవంత్ వంటి వారికి ఏ రేంజ్ లో ఇచ్చి ఉంటారో అని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: