దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో ఒకటి అయిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా వెబ్ సిరీస్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఈ రెండు సీజన్ లు కూడా అత్యంత ప్రజాదారణను దేశ వ్యాప్తంగా సంపాదించుకున్నాయి. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ది ఫ్యామిలీ మెన్ సీజన్ 1 వెబ్ సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందడం తో ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ను చిత్రీకరించారు.

ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా , మనోజ్ బాజ్ పాయ్ ఈ రెండు సిరీస్ లలోనూ  ప్రధాన పాత్రలలో నటించాడు. ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత ఒక కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత కు దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. మనోజ్ బాజ్ పాయ్ తాజాగా ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 షూటింగ్ ప్రారంభం గురించి స్పందించాడు.

ఈ సంవత్సరం దర్శకులు రాజ్ అండ్ డీకే మరియు నేను కూడా ఇతర ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్నాము.  వచ్చే సంవత్సరం మొదట్లో ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 షూటింగ్ ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని తాజాగా మనోజ్ బాజ్ పాయ్ తెలిపాడు. ఇది ఇలా ఉంటే ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా..?  ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: