తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తలకెక్కుతున్న ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్టు , ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి నన్నయ్య రాసిన అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం మరొక అద్భుతమైన అప్డేట్ ను విడుదల చేసింది. 

మూవీ లో తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శింబు ఒక పాట పాడిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాటను విడుదల తేదీని ఈ చిత్ర బృందం ప్రకటించింది. శింబు ఈ మూవీ లో "టైం ఇవ్వు పిల్ల" అనే పాటను పాడాడు. ఈ పాటను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో శింబు కి మూవీ యూనిట్ థ్యాంక్స్ చెబుతూ , శింబు కు సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే కార్తికేయ 2 మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ లు ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: