అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడం తో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. 

అందులో భాగంగా ఈ మూవీ కి "యూఎస్ఏ" లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు ప్రస్తుతం లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ "యూ ఎస్ ఏ" లో 700 ప్లస్ కే కలెక్షన్ లను సాధించింది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ కలెక్షన్ లకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి "యు ఎస్ ఏ" తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర ప్రాంతాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ సూపర్ హిట్ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: