‘అల వైకుంఠ పురములో’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ కొట్టి మూడు సంవత్సరాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీగా ఉండటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా అనుకుని ఆతరువాత ఆమూవీ క్యాన్సిల్ కావడంతో త్రివిక్రమ్ మహేష్ తో సినిమాను మొదలు పెట్టడానికి చాల సమయం ఎదురు చూడవలసి వచ్చింది.


మూవీ షూటింగ్ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేసినప్పటికీ ఈమూవీకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ప్రారంభించడంలో అనేక అవాంతరాలు త్రివిక్రమ్ కు ఎదురౌతున్నాయి. మహేష్ తల్లి ఇందిరా దేవి చనిపోవడం ఆతరువాత కృష్ణ చనిపోవడంతో పాటు ఈమూవీ కథలో కూడ మహేష్ అనేక మార్పులు చేర్పులు చెప్పడంతో ఫైనల్ గా ఈమూవీ కథ రెడీ అయింది అంటున్నారు.


ఈసినిమా విడుదల తేదీని ఆగష్టు 11గా ఫిక్స్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. వరసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ఈ డేట్ అన్నివిధాల బాగుంటుందని త్రివిక్రమ్ భావించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈమూవీకి సంబంధించి ఇప్పటికే తీసిన ఫస్ట్ షెడ్యూల్ లోని కొన్ని సన్నివేశాలు మళ్ళీ రీ షూట్ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమాను వేగంగా పూర్తి చేయడానికి మహేష్ తన బల్క్ డేట్స్ ను ఇచ్చినప్పటికీ ఈమూవీలో నటిస్తున్న ఇతర నటీనటుల డేట్స్ సద్దుబాటు చేయడం అంత సులువైన పనికాదు అని అంటున్నారు.దీనికితోడు త్రివిక్రమ్ తన సినిమాలను అంత వేగంగాతీయడు అని అంటారు. దీనితో ఈమూవీ షూటింగ్ మళ్ళీ మొదలై అనుకున్న తేదీకి విడుదల అవ్వడం సాధ్యమేనా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అదేజరిగితే ఈమూవీ విడుదల వచ్చే సంవత్సరం సంక్రాంతికి వాయిదా పడినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి సినిమా చూడటానికి అతడి అభిమానులు అదేవిధంగా మహేష్ అభిమానులు మరికొంత సమయం వేచి చూడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: