తెలుగు ఇండస్ట్రీలోనే  టాప్ యాంకర్ గా కొనసాగుతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మాటలతో ఎంత పెద్ద స్టార్ హీరో నైనా సరే కట్టిపడేస్తుంది యాంకర్ సుమ. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె దాని అనంతరం యాంకర్ గా కొనసాగింది. యాంకర్ గానే కాకుండా హోస్ట్ గా కూడా సుమ అనే షో లలో చేసింది ఈమె. హోస్ట్గా చేసిన స్టార్ మహిళ ,జీన్స్, క్యాష్, భలే ఛాన్స్ ప్రోగ్రాం లు ఎంత పెద్ద హిట్ షోలో మనందరికీ తెలిసిందే. అయితే స్టార్ మహిళ వంటి ప్రోగ్రామ్ ని సుమా ఏకంగా కొన్ని వేల ఎపిసోడ్లలో హోస్ట్ గా వ్యవహరించింది.

యాంకర్ గా కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్ లకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి ఇంటర్వ్యూలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది యాంకర్ సుమ. అయితే ఎన్నో ఏళ్ల నుండి యాంకర్ గా హోస్ట్గా కొనసాగుతున్న సుమ ఇటీవల క్యాష్ ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టి తాజాగా సుమ అడ్డ అనే కొత్త షో ని ప్రారంభించింది.ఇందులో భాగంగానే ఈ షోలో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబి కమెడియన్ వెన్నెల కిషోర్ రావడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ ని చూసిన చాలామంది ఈ షోలో సుమ కాస్త హద్దులు మీరి యాంకరింగ్ చేస్తోంది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ షోలో సుమా మరియు మెగాస్టార్ చిరంజీవి చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంది. వీరి అనంతరం ఈ షో కి జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్లు గెస్ట్ గా వచ్చారు.ఇక ఆ షోలో కూడా సుమ హద్దులు మీరి యాంకరింగ్ ను చేస్తుంది అని సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు రావడం జరిగాయి.అయితే సుమా కేవలం డబ్బుల కోసమే ఇలా హద్దులు మీరి యాంకరింగ్ ను చేస్తుంది అంటూ చాలామంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సుమాపై రాజీవ్ కనకాల కూడా అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: