తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయ్యింది అంటే టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తూ ఉంటాయి. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొట్ట మొదటి సారి ఒక అదిరిపోయే బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రన్ రాజా రన్ , సాహో సినిమాలతో అద్భుతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మించనున్నాడు.

మూవీ ఈ రోజు నుండి లాంచనంగా ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు సుజిత్మూవీ ని పవన్ కళ్యాణ్ తో పాటలు మరియు ఫైట్లు లేకుండా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ పై పాటలు ... ఫైట్లు లేకుండా సినిమా తీయడం అనేది చాలా రిస్క్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో ఇలా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దర్శకుడి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: