
ఈమూవీని చూసిన వారికి వెంటనే ‘రంగస్థలం’ గుర్తుకు వస్తుంది అన్నప్రచారం జరుగుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ లుక్ లా ఈమూవీలో నాని లుక్ రఫ్ గా రగ్డ్ గా ఉండబోతోంది. ‘రంగస్థలం’ మూవీ కథలాగే కులాల గొడవల బ్యాక్ డ్రాప్ లో ఈమూవీ కథ నడుస్తుంది అంటున్నారు. అంతేకాదు ఈమూవీ క్లైమాక్స్ చూసిన వారికి ‘పుష్ప’ క్లైమాక్స్ గుర్తుకు వచ్చి ఈమూవీకి సెకండ్ పార్ట్ ఉంటుంది అన్న అర్థం వచ్చేలా ఈమూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది అంటున్నారు.
తెలుస్తున్న సమాచారం మేరకు ‘దసరా’ క్లైమాక్స్ లో విలన్ కొడుకు విలన్ గా మారే ట్విస్ట్ ఇచ్చి ఎండ్ కార్డ్ వేస్తారని టాక్. దీనితో ఈసినిమాకు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ ఉంటుంది అన్న క్లారిటీ ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈమూవీ సెకండ్ పార్ట్ ఆలోచనలు ఈమూవీ ఘనవిజయం పై ఆధారపడి ఉంటుంది. నాని తనకు ఏర్పడిన పక్కింటి అబ్బాయి ఇమేజ్ ని పోగొట్టుకుని మాస్ హీరోగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆప్రయత్నాలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు.