
కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తేనే చేస్తూ మిగతా హీరోయిన్లతో పోల్స్ చూస్తే తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఏ సినిమాలో కనిపించడం లేదు సాయి పల్లవి. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు దూరమైపోతుంది అంటూ ఒక ప్రచారం తెరమీదకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యయ్. అయితే ఇప్పుడు వరకు ఈ వార్తలపై అటు సాయి పల్లవి మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక కార్యక్రమానికి ఇటీవల గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ క్రమంలోనే నిజం విత్ స్మిత షోలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఈ టాక్ షోలో సాయి పల్లవి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంది అన్నది తెలుస్తుంది. సాయి పల్లవి నిజంగానే సినిమాలను మానేసిందా? నిజంగానే ఒక సెలబ్రిటీని సాయి పల్లవి త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అనే ప్రశ్నలకు ఇక సాయి పల్లవి ఏం చెప్పబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.