సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయని హీరో ఉన్నాడా అంతే చెప్పడం చాలా కష్టం. కానీ ఓ హీరో ఉన్నాడు.అతనే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన మాత్రమే రీమేక్ ల జోలికి వెళ్లని స్టార్ హీరోగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.మన సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ ఇంకా అలాగే నాగార్జున లాంటి హీరోలు కూడా ఎన్నో రీమేక్లు చేసిన వాళ్లే. బ్లాక్ బస్టర్లు కొట్టినవారే. అయితే ప్రస్తుతం ఇప్పుడు సినిమాల ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తుంది. హీరోలు వారు చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వాటిని ముప్పుతిప్పలు పెట్టి భారీ నష్టాలు వచ్చేట్టు తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు.ఇక ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఎన్నో రీమిక్‌ సినిమాలు వచ్చిన ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్, బుట్ట బొమ్మ సినిమాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇలాంటి సమయంలో దర్శక నిర్మాతలు కూడా రీమేక్ సినిమాల వెనకాల పడటం తగ్గిస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరి  ఆ సినిమా హిట్ అవుతుందని నమ్మకం వస్తేనే రీమేక్ సినిమా హక్కులను కొనటం వాటిని సెట్స్ పైకి తీసుకువెళ్లడం లాంటి పనులు చేస్తున్నారు.


అంతే తప్ప వాటి విషయంలో మాత్రం తొందర  పడటం లేదు.టాలీవుడ్ లో మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం సొంత కథలు నమ్ముకోకుండా రీమిక్‌ సినిమాలు వెంట పడుతూ వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయితే ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటికీ వీరు నటించే సినిమాల్లో ఎక్కువ సినిమాలు రీమేక్ లు ఉండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్‌ చేశాడు. అయితే ఇక్కడ ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షలను రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది.పవన్ కళ్యాణ్ భీంలా నాయక్ కూడా లాంగ్ రన్ లో యావరేజ్ గా మిగిలింది. అయినా కానీ వీరిద్దరూ ఇంకా రీమేక్ సినిమాలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ వద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా మేము మారం ఇలానే ఉంటాం అంటూ ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: