ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే అమిగోస్ మూవీ ఈవెంట్ కు బుచ్చిబాబు కూడా హాజరైన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్ కు బుచ్చిబాబు హాజరు కావడంతో తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ ఆగిపోలేదని సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేసి బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నాడని సమాచారం తెలుస్తుంది. తారక్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రావచ్చని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ కాంబో కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న మూవీపై ఫుల్ గా దృష్టి పెట్టారు.


సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నారు. మరో 40 రోజుల తర్వాత ఈ సినిమా షూట్ కూడా మొదలు కానుందని సమాచారం తెలుస్తుంది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్మూవీ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద  ఖచ్చితంగా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు.కొరటాల శివ ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా రెమ్యునరేషన్లకే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఖర్చవుతోందని సమాచారం తెలుస్తోంది. మొత్తం 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల దాకా ఈ సినిమా కోసం బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని చాలా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా అంచనాలను అందుకోవడం ఖాయమని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: