తెలుగు బులితరపై నెంబర్ వన్ యాంకర్ ఎవరంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె పేరే. ఆమె స్వతహాగా మలయాళీ. కానీ తెలుగు వారు కూడా మాట్లాడలేనంతగా గలగల తెలుగు మాట్లాడేస్తూ ఉంటుంది ఆమె. ఇక తన యాంకరింగ్ తో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక తన షో లతో టాప్ రేటింగ్ సాధించి నిర్మాతలకు కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆమె తర్వాత ఎంతోమంది యాంకర్లు వచ్చిన అగ్రస్థానంలో ఉన్న ఆమెను మాత్రం టచ్ చేయలేకపోయారు అని చెప్పాలి. ఇక ఇంతలా ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.


 ఆమె ఎవరో కాదు యాంకర్ సుమ. ఈమె ఏ కార్యక్రమం చేసిన అది సూపర్ హిట్ అవుతుంది అని ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు భావన. హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా పారితోషకం తీసుకుంటుంది అన్నది టాలీవుడ్ లో టాక్. ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు సినిమా ఈవెంట్స్ తో బిజీబిజీగా గడుపుతుంది యాంకర్ సుమ. అయితే ఇక ఎన్నో ఏళ్ల తర్వాత జయమ్మ పంచాయతీ అనే సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దీంతో కొంతమంది వెండితెర ప్రేక్షకులు ఆమెను జయమ్మ అని కూడా పిలవడం మొదలుపెట్టారు.


 సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇక సుమా చేసిన జయమ్మ పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా తర్వాత కొన్ని నిర్మాణ సంస్థలు ఇక సుమాతో సినిమా తీయడానికి చర్చలు జరిపాయట. కానీ సుమా మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి బుల్లితెరకే అంకితం అయిపోవాలని డిసైడ్ అయిందట జయమ్మ. ఇప్పటికే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. ఇక సినిమాలు అంటూ తప్పటడుగు వేసి ఆ ఇమేజ్ను పాడు చేసుకోవాలి అనుకోవట్లేదని నిర్మాతలకు చెప్పేస్తుందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం టాలీవుడ్లో తెగ చక్కర్లు కొడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: