ముఖ్యంగా నందమూరి బాలకృష్ణను బోలా మనిషి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బోలా అంటే మనసులో ఏముంటే అది బయటకి మాట్లాడేస్తూ ఉంటారు. అందరిలా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడటం చేయరు. అంతేకాదు ఇక మనసుకు ఏది నచ్చితే అది వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. 60 ఏళ్లు దాటిన బాలకృష్ణలో ఇంకా చిన్నపిల్లాడు దాగున్నాడని అన్ స్టాపబుల్ కార్యక్రమంతో అందరికీ అర్థమైంది. అంతేకాదు ఇక బాలకృష్ణ తనపై ఎవరైనా పొగడ్తల వర్షం కురిపించారంటే చాలు ఇక వారికోసం ఏం చేయడానికి అయినా కూడా సిద్ధమైపోతూ ఉంటారట. అయితే బాలకృష్ణలో ఉన్న ఇలాంటి మంచి గుణాన్ని క్యాష్ చేసుకునే కొంతమంది నిర్మాతలు కొన్ని సినిమాలకు ఇక తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం.. ఇక మరికొన్ని సినిమాలకు అసలు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం లాంటివి చేస్తూ ఉంటారట.
ఈ క్రమంలోనే బాలయ్య మార్కెట్ విలువ దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు ఉన్న సమయంలో ఇక రెండు సినిమాలను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేశారట. ఇలా రెండు సినిమాలకు గాను ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ త్యాగం చేసేసాడట బాలకృష్ణ. డైరెక్టర్, నిర్మాత తనకు వీరాభిమాని అనే ఉద్దేశంతో ఇక ఇలా ఆ సినిమాల కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పనిచేశారట. ఇంతే కాదు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇక ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసి నిజంగానే మా బాలయ్య గ్రేట్ అంటూ అభిమానులు అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి