
ఆ సినిమానే క్రాంతి. నిర్విక, జాన్విక ప్రెజెన్స్ లో భార్గవ్ మన్నే ఈ సినిమాను నిర్మించారు. భీమ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 3న ఆహాలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో కానీ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. బహుశా ఇది ఆమె బిగ్ బాస్ కు వెళ్లకముందు చేసిన సినిమా కావొచ్చని అంటున్నారు. ఆర్జీవితో ఒక్క వీడియో చేసి పాపులర్ అయిన ఇనయా ఆ దెబ్బతో బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది.
బిగ్ బాస్ లో కూడా తన మార్క్ చూపించగా చివరి వరకు మాత్రం ఉండలేకపోయింది. ఫైనల్ గా క్రాంతి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇనయా చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా విషయంలో ఇనయా కూడా లైట్ తీసుకుంద్ అంటే ఆమెకైనా సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలుసో లేదో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇనయా క్రాంతి ఎలా ఉన్నా సరే ఒక మంచి సినిమాతో ఆమె ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.