
ఈమె అసలు పేరు దీక్షిత.. అయితే అందరూ ముద్దుగా ధీ అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఈమె సోషల్ మీడియా ఖాతాలో కూడా ఈమె పేరు ధీ అని ఉంటుంది.. ఇక ఈమె తండ్రి ప్రముఖ సంగీత దర్శకుడు నారాయన్ అయితే ఈమె ఇండియాలోనే పుట్టినప్పటికీ కూడా ఆస్ట్రేలియాలోని తన చదువును పూర్తి చేసింది.. ఇక పుట్టినప్పటి నుండి మ్యూజిక్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఎవ్వడు 14 ఏళ్లకే సంగీతం నేర్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ధీ ఒక్క దసరా సినిమాలోని పాఠ మాత్రమే కాదు తెలుగులో ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ పాటలను పాడి ప్రేక్షకులను అలరించింది..
గురు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్ లలో ఒకటైన ఓ సక్కనోడా పాట కూడా ఈమె పాడింది. అలాగే మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాటను కూడా ఈ అమ్మాయే పాడి అలరించింది. అలాగే ఈ రెండు పాటలు కూడా యూట్యూబ్ ని బాగా షేక్ చేశాయి. కానీ చంకీల అంగీ లేసి పాట మాత్రం ఒక ఊపు ఊపడంతో అందరూ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెగ వెతికేస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో కూడా మీకు క్రేజ్ పెరగడంతో ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చేటట్లు కనిపిస్తున్నాయి.