
జాతి రత్నాలు సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇక ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. అయితే హీరోయిన్ గానే కాకుండా అటు స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ రోల్స్ లో కూడా నటిస్తూ ఉంది ఈ మద్దుగుమ్మ. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాలో సైతం ఒక వైవిద్యమైన పాత్రలో కనిపించబోతుంది ఫరియా అబ్దుల్లా. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ సొగసరి.
రావణాసుర సినిమాలో రవితేజతో కలిసి నటించడం ద్వారా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను అంటూ ఫరియా అబ్దుల్లా చెబుతుంది. రవితేజ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు అంటూ ప్రశంసలు కురిపించింది ఈ హీరోయిన్. రావణాసుర సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఒక లాయర్ పాత్రలో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ పాత్ర ఎంతో చాలెంజింగ్ గా అనిపించింది అంటూ తెలిపింది. ఎప్పుడు చలాకీగా కనిపించే ఫరియా అబ్దుల్లా డిఫరెంట్ షేడ్స్ లో ఎలా నటిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తనకు కేవలం నటన మీదే కాకుండా దర్శకత్వం ప్రొడక్షన్ మీద కూడా ఆసక్తి ఉంది అంటూ ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది. అయితే ఇక ఇవన్నీ చేయడానికి మాత్రం ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ తెలిపింది ఫరియా అబ్దుల్లా. కాగా ఫరియా పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు.