రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి ది బిగినింగ్ ...  బాహుబలి ది కంక్లూజన్ మూవీ లతో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత అదే రేంజ్ సినిమాలలో నటించాడు. అందులో భాగంగా ఇప్పటికే సహో ... రాదే శ్యామ్ వంటి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లతో ప్రభాస్ ఇప్పటికే ఇండియా రేంజ్ లో తన క్రేజీ ను చాటుకున్నాడు.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్థాయికి మించి పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి అని పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ప్రభాస్ ... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే సినిమాను ఓకే చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అమితా బచ్చన్ ... దిశా పటాని కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ చాలా కాలం క్రితమే ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ మూవీ లోను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్" మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా ... ప్రస్తుతం సలర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే మొదట ఈ రెండు మూవీ లను పాన్ ఇండియా మూవీ లుగా ప్రకటించారు. కాకపోతే ప్రస్తుతం ఈ రెండు మూవీ లను కూడా పాన్ వరల్డ్ మూవీ లుగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభాస్ ప్రస్తుతం మూడు పాన్ వరల్డ్ మూవీ లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రాజెక్టు కే మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: