ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. దానితో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ సినిమా బృందం టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు అయినటు వంటి మార్చి 27 వ తేదీన ఈ సినిమా టైటిల్ ను విడుదల చేయనున్నట్లు ... అలాగే ఈ సినిమాకు "సీఈఓ" అనే టైటిల్ ను ఈ చిత్ర బృందం ఇప్పటికే కన్ఫామ్ చేసినట్టు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ సి 15 మూవీ యూనిట్ కూడా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేయడానికి ఫిక్స్ అయినట్లు ... అలాగే ఈ సినిమాకు "సీఈవో" అనే టైటిల్ ఇప్పటికే ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనునట్లు సమాచారం. అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా లేవల్లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: