జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ల 30వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. rrr సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. ఇక ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో సినిమా బ్యాక్ డ్రాప్ గురించి దర్శకుడు కొరటాల శివ తన పర్సనల్ స్పీచ్ ఇవ్వడంతో పాటు ఈ సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవం ఈ మధ్యనే హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది.


మరో కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సినిమాలో నటిస్తున్న నటీనటుల టెక్నీషియన్ల గురించి కూడా పూర్తిస్థాయిలో ఫైనల్  చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమా మీద ఉన్న అంచనాలతో తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ తెలియజేయడం జరిగింది మేకర్స్.


అదేమిటంటే ట్రాన్స్ఫార్మర్స్ యాక్షన్ డైరెక్టర్ కెన్ని బెట్ని ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టంట్ మాస్టర్ కి కెన్ని ఎన్టీఆర్ -30 సినిమాతో చర్చలు జరుపుతున్నట్లుగా చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. తన కెరియర్ లో 175 చిత్రాలకు పనిచేసిన ఈ వరల్డ్ ఫేమస్ స్టంట్ మాన్ గతంలో మిషన్ ఇంపాజిబుల్, ఘోస్ట్, ప్రోటోకాల్ తదితర ట్రాన్స్ఫార్మర్స్ ప్రాంచైజీకి పనిచేశారు. ఇక అభిమానులతోపాటు ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా టర్న్ అయ్యే విధంగా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తున్నారు మరొక పక్క ఈ సినిమానే నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: