తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును ఈ యువ హీరో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఫలక్ నామ దాస్ అనే మూవీ కి దర్శకత్వం వహించి ... ఆ మూవీ లో హీరో గా నటించి దర్శకుడిగా ... హీరోగా మంచి మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పలకనామ దాస్ మూవీ తర్వాత ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే మూవీ కి దశకత్వం వహించడం తో పాటు ఈ మూవీ లో హీరో గా కూడా నటించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ కి యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీ కి యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కే ప్లస్ కనెక్షన్ లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ కలెక్షన్ లు యూఎస్ఏ లో విశ్వక్ కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్ లుగా కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ మూవీ కి యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: