మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన గ్లోబల్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని కూడా ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరిపింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసింది.

సినిమా బృందం ఈ సినిమాకు "గేమ్ చేంజర్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నిన్న మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నైజాం మరియు వైజాగ్ లలో దిల్ రాజు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.  దీనితో గేమ్ చెంజార్ మూవీ సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశాలు లేవు అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: