
అయితే రామ్ ప్రయత్నాలను లెక్కచేయకుండా నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపూడిల మూవీని దసరా కు విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు రవితేజా కూడ దసరా రేస్ లో ఎంటర్ కావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ బయోపిక్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.
కొన్ని దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురంలో నాగేశ్వరరావు అనే గజదొంగ ధనవంతులను దోచుకుని ఆ డబ్బును పేదవారికి పంచేవాడు అని చెపుతారు. రాబిన్ హుడ్ తరహాలో అతడి పై అనేక కథలు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో రేణు దేశాయ్ కూడ నటిస్తోంది. ఈ మూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం బయోపిక్ మూవీలను జనం బాగా చూస్తున్న పరిస్థితులలో ఈ మూవీ కూడ ఖచ్చితంగా సక్సస్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఒకవైపు అనీల్ రావిపూడిల కాంబినేషన్ మరొక వైపు రవితేజా మాస్ మసాల నటన మధ్యలో బోయపాటి మార్క్ తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రామ్ దీనితో సంక్రాంతి రేస్ ను తలపించేలా దసరా సినిమాల రేస్ ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఈ మూవీకి ఏర్పడే క్రేజ్ వచ్చే నెలలో విడుదల కాబోతున్న ‘రావణాసుర’ ఫలితం పై ఆధారపడి ఉంది..