అద్భుతమైన టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ లో గోపీచంద్ లుక్ కు గాను ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ ... శ్రీ వాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రామబాణం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు.

 ఈ సినిమాలో డింపుల్ హాయతి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు మిక్కీ కే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం "ఐ ఫోన్" అనే ఒక పాటను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఏ సినిమాలోని దరువైరా అనే రెండవ పాటను ఏప్రిల్ 14 వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: