భారతీయ రెజ్లర్లు చేస్తున్న పోరాటం ప్రస్తుతం దేశం మొత్తం పెను సంచలనంగా మారింది. అన్ని వర్గాల ప్రజల నుంచి  కూడా వారికి సపోర్ట్ దొరుకుతుంది.

బీజేపీ మరియు ఇండియన్ రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమని ఎంపీగా సాక్షిగా వేధించాడని మాలిక్, వినేష్ ఫోగట్, సంగీత లాంటి రెజ్లర్లు ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని వారు తెగ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో రెజ్లర్ల నిరసన రోజు రోజుకు ఎక్కువవుతోంది. దేశం నలువైపుల నుంచి వారికి సపోర్ట్ కూడా పెరుగుతోంది.సినిమా, తన పర్సనల్ వ్యవహారాలు తప్ప సామాజిక అంశాల గురించి ఎప్పడూ స్పందించిన టాలీవుడ్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా తాజాగా రెజ్లర్లకి మద్దతుగా పోస్ట్ ను పెట్టింది. పోలీసులతో సాక్షి మాలిక్ పోరాడుతున్న పిక్ ని ఇలియానా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సాక్షి మాలిక్ గురించి గతంలో మోడీ ప్రశంసలు కురిపించిన ట్వీట్ ని కూడా ఆమె షేర్ చేసింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించిన మహిళా రెజ్లర్ పరిస్థితి ఇదీ అని అర్థం వచ్చేలా ఇలియానా ఆ పోస్ట్ చేసింది. రెజ్లర్లకి మద్దతు తెలిపినందుకు ఇలియానా పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రభుత్వం ఎంతకీ స్పందించని కారణంగా వారు సాధించిన మెడల్స్ ని గంగా నదిలోకి పడేసేందుకు రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే పతకాలని గంగా నదిలో పడేసేందుకు రెజ్లర్లు సిద్ధంకాగా అక్కడికి వారికి మద్దతుగా చేరుకున్న కొందరు ప్రజా సంఘాల నాయకులు చర్చలు జరపడం తో కష్టపడి సొంతం చేసుకున్న మెడల్స్ గంగ పాలు చేయవద్దని నచ్చజెప్పారు. ప్రభుత్వానికి ఇంకాస్త టైం ఇచ్చి చూడండి అని చెప్పడంతో రెజ్లర్లు ఆ విషయంలో వెనక్కి తగ్గారు. గతంలో సాక్షి మాలిక్ రెజ్లర్ గా ఒలంపిక్ మెడల్ గెలిచింది.. ఆ సమయంలో ప్రధాని మోడీ.. ఆమె తర్వాత తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని కూడా ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: