తెలుగు సినీ పరిశ్రమ లో ఒకప్పుడు వరుస సినిమాల తో అలరించిన హీరోయిన్లలో సంఘవి కూడా ఒకరు. దాదాపు రెండు దశాబ్దలు ఇండస్ట్రీ లో కథానాయికగా ఆమె అలరించింది. దక్షిణాదిలో నే కాకుండా..బాలీవుడ్ ఇండస్ట్రీలో నూ దాదాపు 100 చిత్రాల్లో ఆమె నటించారు. తాజ్ మహల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమై న సంఘవి.. అందం, సహజ నటనతో ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది.  ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె మెప్పించింది. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన సంఘవి.. 1993-2004 మధ్యకాలంలో స్టార్ హీరోయిన్‏ గా ఓ వెలుగు వెలిగిందని చెప్పాలి.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. 1997లో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం కుగానూ ఆమెకు నంది అవార్డ్ కూడా అందుకున్నారు. తెలుగుతో పాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటించిన ఆమెకు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉండేది. అయితే అవకాశాలు తగ్గిన తర్వాత చాలా కాలం ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు సంఘవి. ఇక ఈ హీరోయిన్ చాలా ఆలస్యంగా అయితే వివాహం చేసుకున్నారు.

2016లో ఐటీ ఉద్యోగి తో కలిసి పెళ్లి పీటలు ఎక్కారటా సంఘవి. వీరికి ఓ పాప కూడా జన్మించింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు సంఘవి. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. త్వరలో ఆమె కూడా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.సంఘవి ఒకప్పుడు హాట్ పాత్రలతో పాటు కథా ప్రాధాన్యం వున్న సినిమాలలో కూడా నటించారు. ముఖ్యంగా సూర్య వంశం సినిమాలో ఆమె పాత్రకు అలాగే ఆమె మీద వచ్చే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు.అలాగే ఆమె ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా సినిమాలో కూడా మెప్పించింది. తన కంటే చాలా చిన్న అయిన ఎన్టీఆర్ తో కలిసి నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: